Politics24th Oct 02:52 PMSunil Byrisetty1 min read
అరుదైన బయోపిక్.. సమాజానికి అవసరం
ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే.. అయిదు సార్లు సిపిఐ ML పార్టీ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కమ్యూనిస్టు పార్టీలు వ్యతిరేకిస్తున్న కాలంలో
ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే.. అయిదు సార్లు సిపిఐ ML పార్టీ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కమ్యూనిస్టు పార్టీలు వ్యతిరేకిస్తున్న కాలంలో 1983 సమయం నుంచి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ఆయన తెలంగాణా ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చారు. సైకిల్ పై ఎక్కడైనా ప్రయాణం, మన ఇంట్లో వ్యక్తుల లాగా టీ బంకుల దగ్గర టిఫిన్ సెంటర్ల దగ్గర తినడం.. ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే బస్సులో ప్రయాణం.. హైదరాబాద్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చినా కానీ పార్టీ ఆఫీసులో పడుకొని సిటీ బస్సులో అసెంబ్లీకి రావడం.. తనకంటూ ఏమి సంపాదించుకోకుండా, తనకు వచ్చిన జీతాన్ని సైతం పార్టీ ఆఫీసులో జమ చేయడం, వాళ్లు ఇచ్చిన దానితో తన జీవితాన్ని గడపడం.. తనకు వచ్చిన రెండు ఎకరాల భూమి తప్ప ఇంతవరకు అతని దగ్గర ఎటువంటి సంపాదన లేకపోవడం విశేషం.. ఆ నాయకుడు ఎవరో తెలుసా గుమ్మడి నరసయ్య.