News21st Apr 03:52 PMSunil Byrisetty1 min read

అమెరికా ఉపాధ్యక్షుడి సతీమణికి రైల్వే అరుదైన గిఫ్ట్!

భారతదేశ పర్యటనకు వస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్‌కు కేంద్ర రైల్వే శాఖ అరుదైన గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. ఉషా వాన్స్ మూలాలు ఉన్న కృష్ణా జిల్లా ఉయ్య

అమెరికా ఉపాధ్యక్షుడి సతీమణికి రైల్వే అరుదైన గిఫ్ట్!
భారతదేశ పర్యటనకు వస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్‌కు కేంద్ర రైల్వే శాఖ అరుదైన గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. ఉషా వాన్స్ మూలాలు ఉన్న కృష్ణా జిల్లా ఉయ్యూరు గ్రామ సమీపంలోని రైల్వే స్టేషన్ మెమోంటోను గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు అధికారికంగా భారత్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు కాగానే ఇండియాకు వస్తున్న ఉషా వాన్స్ కు మెమెంటోను కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ బహుకరించనున్నారు. కృష్ణా జిల్లా సాయిపురం సమీపంలోని రైల్వే స్టేషన్ వివరాలను విజయవాడ డివిజన్ రైల్వే అధికారులు ఇప్పటికే కేంద్ర రైల్వే శాఖకు పంపారు. సాయిపురం సమీపంలోని వెంటప్రగడ, గుడివాడ, సత్యవాడ, తణుకు రైల్వే స్టేషన్ల వివరాలను సేకరించి కేంద్ర రైల్వే శాఖకు పంపారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు సాయిపురం గ్రామం సమీపంలో ఉషా వాన్స్ కుటుంబ సభ్యుల మూలాలున్నాయి. 1970వ సంవత్సరంలో కృష్ణా జిల్లా నుంచి వలస వెళ్లిన ఉషా వాన్స్ తల్లి తండ్రులు శ్రీలక్ష్మీ,రాధాకృష్ణ అమెరికాలో సెటిలయ్యారు.
America JD Vance
Usha Chilukuri
Usha Vance JD Vance Visit To India
విజయవాడ డివిజన్ రైల్వే
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
కేంద్ర రైల్వే శాఖ అరుదైన గిఫ్ట్
Scroll for the next article