Health6th Oct 04:10 PMSunil Byrisetty1 min read

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అరుదైన ఘట్టం

గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేస్తోందని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ య

రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అరుదైన ఘట్టం
గ్రామీణ, గిరిజన ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేస్తోందని వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడ‌ నూతన విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగానే రాష్ట్రంలోని 24 జిల్లాల్లో మరో 266 భవనాలను వర్చువల్‌గా ప్రారంభించారు. వీటి నిర్మాణానికి సుమారు రూ.105 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి తెలిపారు. 24 జిల్లాల్లోని 87 నియోజకవర్గాల పరిధిలో ఈ భవనాలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి చెప్పారు. రాబోయే 6 నెలల్లో మిగిలిన 4,400 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇందులో ఈ ఏడాది చివరి నాటికి 2,700 కేంద్రాల నూతన భవనాలను సిద్ధం చేసేలా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. గ్రామం నుంచి పట్టణానికి వెళ్లి వైద్యం పొందాల్సిన అవసరం లేకుండా వైద్య సేవలనే గ్రామానికి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ లో ఒకేసారి 267 నూతన ఆరోగ్య భవనాలను ప్రారంభించడం అరుదైన ఘట్టంగా నిలిచింది.
Scroll for the next article