News9th Apr 11:37 AMSunil Byrisetty1 min read

చంద్ర రాజేశ్వరరావు చిత్రపటానికి తెలనాకుల సత్యనారాయణ పూలమాలవేసి నివాళులర్పించారు

పార్టీ కోసం ప్రజల కోసం సర్వస్వం త్యాగం చేసిన వ్యక్తి కీర్తిశేషులు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు అని సిపిఐ గురజాల నియోజకవర్గ కార్యదర్శి మందపాటి రమణారెడ్డి అన్నారు బుధవారం నారాయణపురం స

 చంద్ర రాజేశ్వరరావు చిత్రపటానికి తెలనాకుల సత్యనారాయణ పూలమాలవేసి నివాళులర్పించారు
పార్టీ కోసం ప్రజల కోసం సర్వస్వం త్యాగం చేసిన వ్యక్తి కీర్తిశేషులు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు అని సిపిఐ గురజాల నియోజకవర్గ కార్యదర్శి మందపాటి రమణారెడ్డి అన్నారు బుధవారం నారాయణపురం సిపిఐ మండల కార్యాలయంలో చండ్ర రాజేశ్వరరావు 31వ వర్ధంతి జరిగింది చంద్ర రాజేశ్వరరావు చిత్రపటానికి తెలనాకుల సత్యనారాయణ పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ రాజేశ్వరరావు డాక్టర్ చదువుతూ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శిగా 28 సంవత్సరాలు పనిచేసే దేశవ్యాప్తంగా లక్షలాది ఎకరాలు పేదలకు పంపిణీ చేశారు అన్నారు రాజేశ్వరరావు జమీందారీ కుటుంబంలో జన్మించి తనకు వచ్చిన ఆస్తి మొత్తం పేదలకు పంచారన్నారు అంటరానితనాన్ని వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి చండ్ర రాజేశ్వరరావు ఆయన చేసినటువంటి శాంతి ఉద్యమాలకు గాను ఆర్డర్ ఆఫ్ లెనిన్ అవార్డుతో సోవియట్ యూనియన్ ఆర్డర్ ఆఫ్ డెబిట్ రా అవార్డుతో బల్గేరియా అలాగే చెకోస్లో వేకియా మంగోలియా దేశాలు కూడా అవార్డులతో సత్కరించాయి బాబ్రీ మసీదును మ్యూజియంలో కాపాడాలని రాజీ ఫార్ములాను ప్రకటించినారు తుది శ్వాస వరకు కమ్యూనిస్టు పార్టీలో కొనసాగి తనకు ఉన్న ఆస్తి పుస్తకాలు బట్టలు పేదలకు ఇవ్వాలని వీలునామాలో రాశారు ఈ కార్యక్రమంలో ఎడ్ల భాస్కర్ ప్రత్తిపాటి వెంకట నాగరాజు మురికిపూడి సర్వయ్య తమ్మిశెట్టి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు
CPI
Gurazala Assembly constituency
Chandra Rajeshwara rao
మందపాటి రమణారెడ్డి
చండ్ర రాజేశ్వరరావు 31వ వర్ధంతి
Scroll for the next article