Politics4th Mar 04:45 PMSunil Byrisetty1 min read

మహిళలు, చిన్నారుల భద్రత కోసం శక్తి: హోంమంత్రి అనిత

మహిళలు, చిన్నారుల భద్రత కోసం 'ప్రత్యేక రక్షణ విభాగం' ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ' 'ఈగల్' తరహాలో ఐజీ స్థాయి ఐపీఎస్ అధికారి దీనికి నేతృత్వం వహిస్తారన్

మహిళలు, చిన్నారుల భద్రత కోసం శక్తి: హోంమంత్రి అనిత
మహిళలు, చిన్నారుల భద్రత కోసం 'ప్రత్యేక రక్షణ విభాగం' ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ' 'ఈగల్' తరహాలో ఐజీ స్థాయి ఐపీఎస్ అధికారి దీనికి నేతృత్వం వహిస్తారన్నారు. మహిళలకు రాజకీయాలకతీతంగా రక్షణ చర్యలు చేపడతామని ఆమె స్పష్టం చేశారు. మహిళల భద్రత విషయంలో రాజీపడబోమన్నారు. దిశ యాప్ తో గత ప్రభుత్వంలో రక్షణ ఉండేదన్న వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశ చట్టం కింద ఫిర్యాదు చేసిన కేసు ఒక్కటైనా ఉందా? 'దిశ' కేవలం ప్రచారానికే పరిమితమైందన్నారు. ఐదేళ్లలో దిశ చట్టాన్ని ఎందుకు చేయలేదు? అంటూ సూటిగా ప్రశ్నించారు. దిశ యాప్‌కు చట్టబద్ధత ఎక్కడుంది? ఎంతమందిని యాప్ ద్వారా కాపాడారు? వివరాలు చెప్పాలని హోంమంత్రి డిమాండ్ చేశారు. వేధింపులు జరిగితే దిశ చట్టం కింద ఫిర్యాదు చేసిన కేసు ఒక్కటైనా ఉందా? అని అడిగారు. వైసీపీ ప్రభుత్వంలో పస లేని దిశ చట్టాన్ని పక్కన పెట్టి సరికొత్తగా శక్తి యాప్ ని తీసుకువస్తున్నట్లు హోంమంత్రి అనిత మండలిలో ప్రకటించారు. నెట్ వర్క్ లేని రిమోట్ ప్రదేశాల్లో కూడా పనిచేసేలా ప్రత్యేకంగా యాప్ ని తీర్చిదిద్దుతున్నట్లు తెలియజేశారు. మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు చేతులమీదుగా 'శక్తి యాప్ 'ను ఆవిష్కరించనున్నట్లు హోంమంత్రి అనిత పేర్కొన్నారు.
Home Minister
Vanga lapudi Anitha
AP Assembly 2025
Sakthi App
హోం మంత్రి
వంగ లపూడి అనిత
అసెంబ్లీ 2025
శక్తి యాప్
Scroll for the next article