News24th Apr 08:52 AMSunil Byrisetty1 min read
అరుణాచలం వెళ్ళు భక్తులకు సదావకాశం
గుంటూరు, పరిసర ప్రాంత శివ. భక్తులకు, ప్రయాణీకులకు శుభవార్త. అరుణాచలంలో మే నెల 12న పౌర్ణమి సందర్భంగా జరిగే గిరి ప్రదక్షణ మహోత్సవాలకు గుంటూరు 2 డిపో నుంచి స్పెషల్ బస్సు నడుపుతున్నారు
గుంటూరు, పరిసర ప్రాంత శివ. భక్తులకు, ప్రయాణీకులకు శుభవార్త.
అరుణాచలంలో మే నెల 12న పౌర్ణమి సందర్భంగా జరిగే గిరి ప్రదక్షణ మహోత్సవాలకు గుంటూరు 2 డిపో నుంచి స్పెషల్ బస్సు నడుపుతున్నారు.
హైటెక్ (2+2 )పుష్ బ్యాక్ బస్ ఏర్పాటు చేశారు.
ఈ బస్ మే 10 వ తారీకు రాత్రి 9:15 గంటలకు గుంటూరులో బయలు దేరి, మే 11 న శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీ పురం గోల్డెన్ టెంపుల్ దర్శించుకొని అదే రోజు రాత్రి బయలు దేరి పౌర్ణమిరోజు అనగా మే 12వ తారీఖు ఉదయం అరుణాచలం చేరుకుంటుంది.
అదే రోజు అరుణాచలేశ్వరుని దర్శించుకొని, మే 12 వ తారీకు సాయంత్రం అరుణాచలంలో బయలు దేరి మే 13 ఉదయం 6:30 గంటలకు గుంటూరు చేరుతుంది. సర్వీస్ నెంబర్ *96164*ద్వారా ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకొనే అవకాశం కల్పించారు.
గుంటూరు, పరిసరప్రాంత శివ భక్తులు, ప్రయాణీకులు ఉపయోగించుకోవాలని, ఒక్కోటికెట్ ధర రూ. 2420/- మాత్రమేనని గుంటూరు 2 డిపో మేనేజర్ షేక్ అబ్దుల్ సలామ్ ఒక ప్రకటనలో తెలిపారు. అదనపు సమాచారం కోసం
7382897459
7382896403
నంబర్లను సంప్రదించాలని కోరారు.