News24th Apr 02:56 PMSunil Byrisetty1 min read

పోలీస్ యాక్షన్ “స్టాప్, వాష్, రిఫ్రెష్ అండ్ గో”

జాతీయ రహదారులపై రాత్రిళ్లు ప్రమాదాలను నివారించాలన్న ఉద్దేశంతో ఎన్.టి.ఆర్ జిల్లా నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు యాక్షన్లోకి దిగారు. ఆయన ఆదేశాల మేరకు పోలీసు అధికారులు సిబ్బం

పోలీస్ యాక్షన్ “స్టాప్, వాష్, రిఫ్రెష్ అండ్ గో”
జాతీయ రహదారులపై రాత్రిళ్లు ప్రమాదాలను నివారించాలన్న ఉద్దేశంతో ఎన్.టి.ఆర్ జిల్లా నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు యాక్షన్లోకి దిగారు. ఆయన ఆదేశాల మేరకు పోలీసు అధికారులు సిబ్బందితో కలిసి రాత్రి/ తెల్లవారుజాము సమయాల్లో హైవేలపై వినూత్న కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా అంతర్రాష్ట్ర సరిహద్దులున్న తిరువూరు హైవే సమీపంలో, జి. కొండూరు హైవే సమీపంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. స్టాప్, వాష్, రిఫ్రెష్ అండ్ గో కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి సమయాలలో ప్రధాన రహదారుల మీద ప్రయాణించే వాహన డ్రైవర్లు నిద్రలేకుండా ఎక్కువ దూరాలకు ప్రయాణించడం వల్ల తెల్లవారు జామున అనగా 3 గంటల నుంచి 5 గంటల ప్రాంతాలలో నిద్రలోకి జారి ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిని నివారించేందుకు స్టాప్, వాష్, రిఫ్రెష్ అండ్ గో పేరుతో వాహనాలను ఆపి, నీళ్లు అందించి, ముఖం కడుక్కున్నాక తిరిగి పంపుతున్నారు.
Highway
special drive
Thiruvur Highway
Police
Kondur Highway
ఎన్.టి.ఆర్ జిల్లా
కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు
హైవేలపై వినూత్న కార్యక్రమం
Scroll for the next article