Telangana18th May 12:50 PMSunil Byrisetty1 min read
అట్టలతో తెలంగాణ సచివాలయం
ఓ విద్యార్థి అట్టలతో తెలంగాణ సచివాలయం రూపొందించాడు. అచ్చు గుద్దినట్లు అట్ట పెట్టెలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు. ప్రత్యేకమైన నిర్మాణ శైలితో ఉన్న కొత్త సచివాలయం క్లిష్టమైన నిర్మాణా
ఓ విద్యార్థి అట్టలతో తెలంగాణ సచివాలయం రూపొందించాడు.
అచ్చు గుద్దినట్లు అట్ట పెట్టెలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు.
ప్రత్యేకమైన నిర్మాణ శైలితో ఉన్న కొత్త సచివాలయం క్లిష్టమైన నిర్మాణానికి నమూనా తయారు చేశాడు అక్షయ్ అనే విద్యార్థి.
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన బాలగోని అక్షయ్ గౌడ్..ఘట్కేసర్ మండలం నారపల్లిలోని అంజని స్కూల్‌లో పదో తరగతి చదువుతున్నాడు.
సృజనాత్మకంగా ఆలోచించే అక్షయ్ గౌడ్.. ఇప్పటికే తాము నివసిస్తున్న ఇంటి నమూనా, పోచారం స్పటిక రామలింగేశ్వర స్వామి వారి ఆలయం, ట్రాక్టర్, ట్రక్, జీపులను తయారు చేశాడు. తాజాగా తెలంగాణ సచివాలయం నమూనాను అట్టలతో రూపొందించాడు.
దీనిలో రిమోట్ సిస్టంతో లైటింగ్ అమర్చాడు.
దుమ్ము ధూళి పట్టకుండా రక్షణ కవచంగా ఫ్రేమ్ ని కూడా తయారు చేశాడు.
ఈ నమూనా అందరినీ ఆకట్టుకుంటోంది.