News16th Jun 11:33 AMSunil Byrisetty1 min read
18 ఏళ్లు పైబడిన మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే మరో పథకాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. 18 ఏళ్లు నిండిన మహిళల ఖాతాలో రూ.18 వేలు జమ చేసేందుకు సిద్ధం అవుతోంది. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే మరో పథకాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. 18 ఏళ్లు నిండిన మహిళల ఖాతాలో రూ.18 వేలు జమ చేసేందుకు సిద్ధం అవుతోంది. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. 18 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అయ్యింది. 18-59 ఏళ్ల మధ్య వయసు ఉన్న అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ.1500 నేరుగా వారి ఖాతాలో జమ చేయనున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ పథకం అమలు కోసం 2024-2025 బడ్జెట్‌లో రూ.3,341.82 కోట్లు నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే.