News15th Mar 04:23 PMSunil Byrisetty2 min read

19 నుంచి బాల ఆధార్ శిబిరాలు

ఆధార్ కార్డులు లేని చిన్నారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బాల ఆధార్ ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయశాఖ నిర్ణయించింది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫి

19 నుంచి బాల ఆధార్ శిబిరాలు
ఆధార్ కార్డులు లేని చిన్నారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బాల ఆధార్ ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయశాఖ నిర్ణయించింది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఉండి కూడా ఆధార్ కార్డులు లేని ఆరేళ్లలోపు చిన్నారులు 1,86,709 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరిలో కొందరు వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడం, ఇతర రాష్ట్రాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం ఇతర కారణాల వల్ల ఆధార్ కార్డులు తీసుకోలేకపోయినట్లు తెలిసింది. జియో ట్యాగింగ్ ప్రక్రియలో వీరి వివరాలు చూపించక పోవడంతో ట్యాగింగ్ ప్రక్రియకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జనన ధ్రువీకరణ పత్రాలు ఉన్న చిన్నారులందరి వివరాలతో ఆధార్ కార్డులు పొందేందుకు రెండు ప్రత్యేక శిబిరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్వహించాలని ఆదేశించింది. ఈనెల 19 నుంచి 22 వరకు, 25 నుంచి 28 వరకు వీటిని నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా వీరితోపాటు ఆధార్ అప్డేట్ చేసుకోని వారు సుమారు 52.02 లక్షల మంది ఉన్నట్లు గుర్తించింది. వీరు కూడా వారి వివరాలు అప్డేట్ చేసుకొనేందుకు అవకాశం కల్పించింది. ఆధార్ కార్డులు లేని చిన్నారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బాల ఆధార్ ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయశాఖ నిర్ణయించింది. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఉండి కూడా ఆధార్ కార్డులు లేని ఆరేళ్లలోపు చిన్నారులు 1,86,709 మంది ఉన్నట్లు గుర్తించారు. వీరిలో కొందరు వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడం, ఇతర రాష్ట్రాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం ఇతర కారణాల వల్ల ఆధార్ కార్డులు తీసుకోలేకపోయినట్లు తెలిసింది. జియో ట్యాగింగ్ ప్రక్రియలో వీరి వివరాలు చూపించక పోవడంతో ట్యాగింగ్ ప్రక్రియకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జనన ధ్రువీకరణ పత్రాలు ఉన్న చిన్నారులందరి వివరాలతో ఆధార్ కార్డులు పొందేందుకు రెండు ప్రత్యేక శిబిరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్వహించాలని ఆదేశించింది. ఈనెల 19 నుంచి 22 వరకు, 25 నుంచి 28 వరకు వీటిని నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా వీరితోపాటు ఆధార్ అప్డేట్ చేసుకోని వారు సుమారు 52.02 లక్షల మంది ఉన్నట్లు గుర్తించింది. వీరు కూడా వారి వివరాలు అప్డేట్ చేసుకొనేందుకు అవకాశం కల్పించింది.
Aadhaar Camps For Children
Andhra Pradesh
పిల్లల కోసం ఆధార్ శిబిరాలు
ఆంధ్రప్రదేశ్
Scroll for the next article