National22nd Oct 12:42 PMSunil Byrisetty1 min read

విద్యార్థులూ.. ఆధార్ అప్డేట్ చేసుకోండి

ఈ నెల 23 నుంచి 31 వరకు ఎనిమిది రోజుల పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఆధార్ ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. ఆధార్ వివరాల మార్పు, నవీకరించుకోవడానికి ఈ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. తప

విద్యార్థులూ.. ఆధార్ అప్డేట్ చేసుకోండి
ఈ నెల 23 నుంచి 31 వరకు ఎనిమిది రోజుల పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఆధార్ ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. ఆధార్ వివరాల మార్పు, నవీకరించుకోవడానికి ఈ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ (ఎంబీయూ) పెండింగ్ ఉన్నవారి కోసం ప్రత్యేకంగా వీటిని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవల గ్రామ, వార్డు సచివాలయాల శాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. వీటి నిర్వహణ కోసం పాఠశాలల్లో అంతర్జాలం, విద్యుత్తు, వసతి ఇతర సదుపాయాలు కల్పించాలని విద్యాశాఖకు సూచించారు. జేఈఈ, నీట్ వంటి ప్రవేశ/పోటీ పరీక్షలకు హాజరయ్యేవారికి వివిధ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ అప్డేట్ తప్పనిసరి. పిల్లలు పెరుగుతున్నకొద్దీ వారి వేలిముద్రలు, ఇతర బయోమెట్రిక్ లక్షణాలు మారే అవకాశం ఉండడంతో నవీకరణ చేస్తున్నారు. ఈ వివరాల కచ్చితత్వాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధార్ అప్ డేట్ తప్పనిసరి చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఐదేళ్లు నిండిన వారు తొలిసారి, 15 ఏళ్లు నిండిన విద్యార్థులు రెండోసారి అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
India news
Aadhaar update
students
government schools
biometric update
education department
Aadhaar camps
JEE
NEET
government schemes
విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాలలు
బయోమెట్రిక్ నవీకరణ
Scroll for the next article