News20th Nov 04:45 PMSunil Byrisetty1 min read

ఆధార్ ఉంటేనే ఎంట్రీ?.. త్వరలో కొత్త నిబంధన!

కేంద్ర ప్రభుత్వం ఓ కీలక మార్పు తీసుకురానుంది. హోటల్, రెస్టరెంట్, అపార్ట్మెంట్ ఇలా ఎక్కడికి వెళ్లినా ఆధార్ యాక్సెస్ తప్పనిసరి అవ్వొచ్చు. ఆ మేరకు 'యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇం

ఆధార్ ఉంటేనే ఎంట్రీ?.. త్వరలో కొత్త నిబంధన!
కేంద్ర ప్రభుత్వం ఓ కీలక మార్పు తీసుకురానుంది. హోటల్, రెస్టరెంట్, అపార్ట్మెంట్ ఇలా ఎక్కడికి వెళ్లినా ఆధార్ యాక్సెస్ తప్పనిసరి అవ్వొచ్చు. ఆ మేరకు 'యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా' (UIDAI) త్వరలో కొత్త విధానం తీసుకురానుంది. అదే ఆఫ్లైన్ వెరిఫికేషన్. సంబంధించి కొత్త యాప్ ను తీసుకు రాబోతున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఇప్పుడు కూడా చాలా ప్రదేశాల్లో ఆధార్ తప్పనిసరి నిబంధన ఉంది. అలాంటి చోట ఒరిజినల్ ఆధార్ను చూపించడంతోపాటు జిరాక్స్ కాపీని ఇవ్వాల్సి వస్తోంది. దీనివల్ల వ్యక్తుల కీలక వివరాలు దుర్వినియోగమవుతున్నాయి. దీన్ని నివారించడం కోసం ఆధార్ కార్డుపై వివరాలేమీ లేకుండా కేవలం క్యూఆర్ కోడ్, ఫొటో మాత్రమే ఉండేలా మార్పు తీసుకొచ్చే యోచనలో కేంద్రం ఉంది. అలాగే ఆఫ్లైన్ ఐడీ చెక్ ను కూడా ప్రవేశపెడితే ఆధార్ హార్డ్ కాపీలు చూపించాల్సిన అవసరం ఉండదు. UIDAI సర్వర్లకు కనెక్ట్ కాకుండానే ముఖాన్ని స్కాన్ చేసి వ్యక్తిని ధ్రువీకరించుకుంటారు. యాప్ విడుదలయ్యాక ఈ విధానం ఎలా పనిచేస్తుందో మరింత స్పష్టత వస్తుంది.
Indian govt
Aadhaar
UIDAI
Offline Verification
New Aadhaar Rules
QR Code Aadhaar
Aadhaar Security
Face Scan Verification
హోటల్స్
రెస్టారెంట్లు
అపార్ట్మెంట్లు
డిజిటల్ ఐడెంటిటీ
కేంద్ర ప్రభుత్వం
Scroll for the next article