News25th Aug 09:07 AMSunil Byrisetty1 min read
ఆధార్ అవసరం లేకుండానే ఈ సేవలు
ప్రస్తుతం ఏ ప్రభుత్వ సేవ పొందాలన్నా ఆధార్ అవసరం అవుతోంది. దేశంలో ప్రభుత్వ పథకాలలో ఆధార్ వినియోగం విస్తృతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుక
ప్రస్తుతం ఏ ప్రభుత్వ సేవ పొందాలన్నా ఆధార్ అవసరం అవుతోంది. దేశంలో ప్రభుత్వ పథకాలలో ఆధార్ వినియోగం విస్తృతంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ESIC) అందించే ప్రయోజనాలను పొందేందుకు ఆధార్ తప్పనిసరి కాదని వెల్లడించింది. ఈ నిర్ణయంతో ఎంతోమంది కార్మికులకు ఉపశమనం కలగనుంది. ఇకపై పాస్పోర్ట్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ఇతర గుర్తింపు పత్రాలను ఉపయోగించి ఈఎస్ఐసీ సేవలను పొందవచ్చని పేర్కొంది. ఏదైనా ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డుతో ఈఎస్ఐసీ సేవలు పొందవచ్చు.