News28th Oct 03:38 PMSunil Byrisetty1 min read

ఇకపై ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు..

నవంబర్ 1 నుంచి ఆధార్ కార్డు వివరాల అప్‌డేట్‌లో అతిపెద్ద మార్పు తీసుకురానుంది. ఇకపై పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నంబర్ వంటి ముఖ్యమైన వివరాలను ఆధార్ సేవా కేంద్రానికి వె

ఇకపై ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు..
నవంబర్ 1 నుంచి ఆధార్ కార్డు వివరాల అప్‌డేట్‌లో అతిపెద్ద మార్పు తీసుకురానుంది. ఇకపై పేరు, అడ్రస్, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నంబర్ వంటి ముఖ్యమైన వివరాలను ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లకుండానే పూర్తిగా ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆధార్ అప్‌డేట్ ప్రక్రియను మరింత వేగంగా, సురక్షితంగా మార్చడమే ఈ కొత్త ఆన్‌లైన్ విధానం లక్ష్యం. నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న అతిపెద్ద మార్పు ఏమిటంటే.. జనాభా వివరాల అప్‌డేట్ పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరగనుంది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల వారికి, చిన్న పట్టణాల వారికి ప్రతి చిన్న మార్పు కోసం కిలోమీటర్లు ప్రయాణించి ఆధార్ కేంద్రాల ముందు క్యూలో నిలబడాల్సిన అవసరం తప్పనుంది. పేరు, అడ్రస్ వంటి జనాభా వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. కానీ ఫింగర్ ప్రింట్స్, ఐరిస్ వంటి బయోమెట్రిక్ అప్‌డేట్స్ కోసం మాత్రం తప్పనిసరిగా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది.
Aadhaar
Online Aadhaar Update
Demographic Details
Name Update
Address Update
Date of Birth Update
Gender Update
Mobile Number Update
Digital Aadhaar
Scroll for the next article