Crime8th Mar 10:02 AMSunil Byrisetty1 min read

అనిల్ ఎక్కడ? పోలీసుల వేట

మధ్యంతర బెయిలు పొందిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గుంటూరులో ఆయన ఇళ్లకు వెళ్లి చూడగా తాళాలు దర్శనమిచ్చాయి. ఆయన

అనిల్ ఎక్కడ? పోలీసుల వేట
మధ్యంతర బెయిలు పొందిన రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గుంటూరులో ఆయన ఇళ్లకు వెళ్లి చూడగా తాళాలు దర్శనమిచ్చాయి. ఆయన కుటుంబ సభ్యులు కూడా అందుబాటులో లేకపోవడంతో వారి ఆచూకీ కోసం పోలీసు గాలిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించిన కేసులో అరెస్ట్ అయిన బోరుగడ్డ రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. తన తల్లి ఆరోగ్యం బాగోలేదంటూ ఫిబ్రవరి 15న మధ్యంతర బెయిలు పొందాడు. 28న జైలులో లొంగిపోయాడు. అయితే, ఆ తర్వాత మరోమారు మధ్యంతర బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. తల్లికి సీరియస్‌గా ఉందని మధ్యంతర బెయిలును పొడిగించాలని పేర్కొంటూ మార్చి 11 వరకు మధ్యంతర బెయిలును పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అయితే, న్యాయస్థానానికి బోరుగడ్డ సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్ నకిలీదని, దానిని తాము ఇవ్వలేదని డాక్టర్ పీవీ రాఘవశర్మ వాంగ్మూలం ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి బోరుగడ్డ కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీంతో బెయిలు పొంది ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. బెయిలుపై బయటకు వచ్చిన అతడు విదేశాలకు పారిపోకుండా గుంటూరు పోలీసులు గతంలోనే లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు.
Borugadda Anil Kumar Highcourt
Crime
బోరుగడ్డ అనిల్ కుమార్ హైకోర్ట్
క్రైమ్
Scroll for the next article