News3rd Jun 04:24 PMSunil Byrisetty1 min read

రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ

తెల్ల రేషన్ కార్డుతో సంబందం లేకుండా ఎన్.టి.ఆర్.ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేస్తే రేషన్ బియ్యం స్మగ్లింగ్ ను పూర్తి స్థాయిలో అరికట్టే అవకాశం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమి

రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ
తెల్ల రేషన్ కార్డుతో సంబందం లేకుండా ఎన్.టి.ఆర్.ఆరోగ్యశ్రీ కార్డులను జారీ చేస్తే రేషన్ బియ్యం స్మగ్లింగ్ ను పూర్తి స్థాయిలో అరికట్టే అవకాశం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ పిటిషన్ల కమిటీ అభిప్రాయ పడుతున్నట్లు ఆ కమిటీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె. రఘు రామకృష్ణ రాజు తెలిపారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తమ కమిటీ త్వరలోనే ప్రతిపాదలను పంపనున్నట్లు ఆయన తెలిపారు. శాసన సభ ప్రాంగణంలోని తమ ఛాంబరులో కమిటీ సభ్యులు అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, విశాఖపట్నం ఉత్తర ఎమ్మెల్యే పి. విష్ణు కుమార్ రాజుతో కలసి ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడిచేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మినహా తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు ఏడాదికి రూ.25 లక్షల వరకూ ఆరోగ్య బీమాని ప్రభుత్వం కల్పిస్తున్న నేపథ్యంలో ఎన్.టి.ఆర్.ఆరోగ్యశ్రీ కార్డులను పొందేందుకు ప్రజలకు మక్కువ చూపుతున్నారన్నారు. ఇందుకై వారికి తెల్ల రేషన్ కార్డు అవసరం లేకపోయినా పొందుతున్నారున్నారు. ప్రతి ప్రభుత్వ పథకానికి తెల్ల రేషన్ కార్డునే ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల అవసరం లేనివారు కూడా ఈ కార్డును తీసుకుంటున్నారన్నారు. హెల్త్ కార్డు జారీ విషయంలో తెల్ల రేషన్ కార్డును డిలింక్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Andhra Pradesh news
chandra Babu
ntr Bharosa Pension
collector Dr. G.Lakshmisha
మే 31న ఎన్‌టీఆర్ భ‌రోసా పెన్ష‌న్ల పంపిణీ
Scroll for the next article