Politics31st Jul 11:20 AMSunil Byrisetty1 min read
ప్రభుత్వంపై గొంతెత్తుతున్న మాజీలు!
గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నతాధికారులుగా తీవ్ర ఇబ్బందులు పడిన బాధితులు ఇద్దరూ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై గొంతెత్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఓ వైపు మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటే
గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నతాధికారులుగా తీవ్ర ఇబ్బందులు పడిన బాధితులు ఇద్దరూ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై గొంతెత్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఓ వైపు మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు.. మరోవైపు రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వాయిస్ పెంచారు. ఏబీవీ బనకచర్ల అనవసరమంటూ మాట్లాడుతుంటే.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అమరావతి రెండో విడత భూసమీకరణ అంశంపై చర్చ లేవనెత్తారు. బనకచర్ల ఏపీకి వరప్రదాయిని అంటూ సీఎం చంద్రబాబు ఊరూరా చెబుతున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ రాష్ట్రానికి భారమని ఏబీ వెంకటేశ్వరరావు ఆలోచనాపరుల వేదిక పేరుతో పర్యటనలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంకోవైపు మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ .. రాజధాని రెండో విడత భూసమీకరణకు వ్యతిరేకంగా జనచైతన్య వేదిక పేరుతో గళం విప్పుతున్నారు.