News7th Aug 05:28 PMSunil Byrisetty1 min read
ఏసీబీ వలలో భారీ తిమింగలం
ఎంత పెద్ద స్థాయి అధికారి అయినా అవినీతికి అడ్డు లేదని ఏపీ ఇంజినీర్ ఇన్ చీఫ్ నిరూపించారు. విజయవాడలో లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమశాఖ ఈఎన్‌సీ ఏసీబీ అధికారులకు చిక్కారు. గుత్తేదారు కృష
ఎంత పెద్ద స్థాయి అధికారి అయినా అవినీతికి అడ్డు లేదని ఏపీ ఇంజినీర్ ఇన్ చీఫ్ నిరూపించారు. విజయవాడలో లంచం తీసుకుంటూ గిరిజన సంక్షేమశాఖ ఈఎన్‌సీ ఏసీబీ అధికారులకు చిక్కారు. గుత్తేదారు కృష్ణంరాజు నుంచి రూ.25 లక్షల లంచం తీసుకుంటూ ఈఎన్సీ అబ్బవరపు శ్రీనివాస్ పట్టుబడ్డారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల బిల్లులు చెల్లించేందుకు శ్రీనివాస్ భారీగా లంచం డిమాండ్ చేశారు. అయితే కాంట్రాక్టర్ ఇప్పటికే రూ.25లక్షలు చెల్లించారు. మరో రూ.25లక్షలు ఇవ్వాలని శ్రీనివాస్ డిమాండ్ చేయడంతో కృష్ణంరాజు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు వలపన్ని ఈఎన్‌సీని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.