News2nd Nov 11:45 AMSunil Byrisetty1 min read

అవినీతిపై పోరాటానికి ముందుకు రావాలి

మన సమాజ అభివృద్ధికి అవినీతి అవరోధంగా ఉందని దాన్ని పారదోలాల్సిన అవసరం ఉందని ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ అన్నారు. విజిలెన్స్ అవేర్నెస్ వీక్ -2025 లో భాగంగా ఇందిరాగాంధీ మున్సిపల

అవినీతిపై పోరాటానికి ముందుకు రావాలి
మన సమాజ అభివృద్ధికి అవినీతి అవరోధంగా ఉందని దాన్ని పారదోలాల్సిన అవసరం ఉందని ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ అన్నారు. విజిలెన్స్ అవేర్నెస్ వీక్ -2025 లో భాగంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం ఉదయం సైకిల్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజున అవినీతికి వ్యతిరేకంగా విజిలెన్స్ అవేర్ నెస్ వీక్ ను చేపట్టడం జరుగుతుందన్నారు. నవంబర్ రెండో తారీకు వరకు దీనిపై ప్రజల్లో దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తారన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా సైకిల్ ర్యాలీని చేపట్టామన్నారు. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి లలో కూడా సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధికి అడ్డుగోడగా ఉన్న అవినీతిని పారదోలాల్సి ఉందన్నారు. అవినీతి అనేది రెండువైపులా అంటే ఇచ్చే వారు పుచ్చుకునే వారిపై ఆధారపడి ఉంటుందన్నారు. ఏదైనా అవినీతిపై మీరు ఫిర్యాదు చేయాలనుకుంటే 1064 కు కాల్ చేయవచ్చాన్నారు. దీనిపై వెంటనే అవినీతి నిరోధక శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. అవినీతిపై పోరాటంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి మనకి చాలా సపోర్టు ఉందని తెలిపారు.
Andhra Pradesh
ACB
Atul Singh
Cycle Rally
Good Governance
Public Awareness
Chandrababu Naidu
Vijayawada
Visakhapatnam
సైకిల్ ర్యాలీ
మంచి పాలన
ప్రజా అవగాహన
చంద్రబాబు నాయుడు
Scroll for the next article