News29th Sep 03:48 PMSunil Byrisetty1 min read
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కి బెయిల్
లిక్కర్ స్కాం కేసులో ఏ4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట దక్కింది. విజయవాడ ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ష్యూ
లిక్కర్ స్కాం కేసులో ఏ4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట దక్కింది. విజయవాడ ఏసీబీ కోర్టు మిథున్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ష్యూరిటీలు, రూ. 2 లక్షల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. అలాగే వారంలో రెండు సార్లు విచారణకు రావాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో మిథున్ రెడ్డి రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. దాదాపు రెండు నెలల తర్వాత మిథున్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ లభించింది.