TTD2nd Sep 12:55 PMSunil Byrisetty1 min read

తిరుమల డిప్యూటీ ఈవో ఇంట్లో సోదాలు

తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా యంత్రాంగంలో ఒక్కసారిగా అవినీతి నిరోధక శాఖ భూకంపం సృష్టించింది. నిత్యం శ్రీవారి సేవల్లో బిజీగా ఉండే ఆలయ ఉన్నతాధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు

తిరుమల డిప్యూటీ ఈవో ఇంట్లో సోదాలు
తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా యంత్రాంగంలో ఒక్కసారిగా అవినీతి నిరోధక శాఖ భూకంపం సృష్టించింది. నిత్యం శ్రీవారి సేవల్లో బిజీగా ఉండే ఆలయ ఉన్నతాధికారిపై ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలు వెల్లువెత్తడంతో అధికార వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టారన్న విశ్వసనీయ సమాచారం, అందిన వరుస ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. తిరుపతి ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఏడు ప్రత్యేక బృందాలుగా అధికారులు సోదాలు ప్రారంభించారు. తిరుపతి నగరంలోని ప్రతిష్టాత్మక పెద్దకాపు లేఅవుట్‌లో ఉన్న మెండు లోకనాథం ప్రధాన నివాసంలో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఇల్లంతా జల్లెడ పడుతూ ఆదాయ వ్యయాలు, స్థిర, చరాస్తుల రికార్డులను పరిశీలిస్తున్నారు. సోదాల్లో పెద్ద ఎత్తున స్థిరాస్తి పత్రాలు, బంగారం, వెండి కీలక ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సోదాలు ముగిసిన అనంతరం స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ, నమోదు చేసిన కేసు వివరాలను అధికారికంగా వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
Andhra Pradesh
Tirumala
Tirupati
TTD
Tirumala Tirupati Devasthanams
Deputy EO
Mendu Lokanatham
ACB Raids
ACB
Anti-Corruption Bureau
Disproportionate Assets
అవినీతి ఆరోపణలు
తిరుపతి ఏసీబీ
సోదాలు
ఆస్తుల తనిఖీలు
బంగారం
వెండి
స్థిరాస్తులు
ఆర్థిక లావాదేవీలు
Scroll for the next article