Spiritual19th Jul 04:36 PMSunil Byrisetty1 min read

ఒకే మందిరంలో అన్ని పూజల

ఇంద్రకీలాద్రి క్షేత్రంలో అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో మరింత వేగం కనిపించాలని ఆలయ ఈవో శీనా నాయక్ పేర్కొన్నారు. శ్రీ దుర్గమ్మ వారి సన్నిధిలో భక్తుల సౌకర్యార్ధం చేప

ఒకే మందిరంలో అన్ని పూజల
ఇంద్రకీలాద్రి క్షేత్రంలో అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో మరింత వేగం కనిపించాలని ఆలయ ఈవో శీనా నాయక్ పేర్కొన్నారు. శ్రీ దుర్గమ్మ వారి సన్నిధిలో భక్తుల సౌకర్యార్ధం చేపడుతున్న అభివృద్ధి పనులు గడువుకు ముందే నిర్మాణాలు పూర్తి అయ్యేలా పని చేయాలని ఈవో శీనా నాయక్ ఆదేశించారు. కొండ మీద అన్ని పూజలు ఒకే ప్రాంగణంలో జరిగేలా నిర్మిస్తున్న పూజా మంటపం భవనం, యాగాలు నిర్వహించే సువిశాల యాగశాలలను పరిశీలించి, ఇంజినీరింగ్ సిబ్బంది, కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. శ్రావణ మాసం ఆరంభంలోపే ఈ రెండు నిర్మాణాలు పూర్తి అయితే భక్తులకు సౌలభ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. పూజా మంటపం పైన అంతస్తు పరిశీలన చేశారు. భక్తుల సౌకర్యార్థం మహా మంటపం క్యూలైన్లలో మంచినీటి సరఫరా, మరుగుదొడ్లు, మౌలిక సదుపాయాలు పర్యవేక్షణ చేసి, పారిశుధ్య, సెక్యూరిటీ సిబ్బందికి సూచనలు చేశారు. మహా మంటపం ప్రతీ ఫ్లోర్ సిబ్బంది పర్యవేక్షించాలని, పరిశుభ్రత విషయంలో ఇంకా మెరుగు పడాలని సూచించారు. దర్శనం అయిన భక్తులకు అన్న ప్రసాదం అందుబాటులో ఉందని తెలిసేలా మైక్ ప్రచారం చేయాలని దీనికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోవాలని ఈవో శీనానాయక్ ఆదేశించారు. అన్న ప్రసాదం హాల్ పరిశీలించి, భక్తులతో ఈవో మాట్లాడారు. కొండపైకి చేరే మార్గాలు, కొండ దిగువుకు చేర్చే మార్గాలు అత్యంత శుభ్రంగా ఉండే రీతిలో చర్యలు తీసుకోవాలని, ఆధ్యాత్మిక క్షేత్రాన్ని పవిత్రత గా, పరిశుభ్రతతో ఉంచేలా వ్యవహరించాలని సిబ్బందికి ఆదేశించారు.
Andhra Pradesh news
Vijayawada
Durga Temple Development
Indrakeeladri
EO Sheena Naik
Devotee Facilities
కనకదుర్గ అమ్మవారి దేవస్థానం
భక్తుల సౌకర్యాలు
Scroll for the next article