News15th Mar 05:57 PMSunil Byrisetty1 min read
వంద గ్రామాల్లో వంద శానిటరీ ప్యాడ్స్ వెండింగ్ మిషన్స్
విజయవాడ మెరీస్ స్టేల్లా కాలేజీలో మార్పు ట్రస్ట్, స్టెల్లా కాలేజీలోని మహిళా సాధికారత విభాగం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చ
విజయవాడ మెరీస్ స్టేల్లా కాలేజీలో మార్పు ట్రస్ట్, స్టెల్లా కాలేజీలోని మహిళా సాధికారత విభాగం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) హాజరయ్యారు.
ఋతుస్రావం పరిశుభ్రత, బాల్య వివాహాలు, మానసిక ఆరోగ్యం ఒత్తిడిపై ఇంటర్న్ షిప్ చేసి ప్రజెంటేషన్ ఇచ్చిన విద్యార్ధులు జి.పవిత్ర, ఐశ్వర్యమణి, శ్రీనిధిలను ఎంపి అభినందించారు.
చైల్డ్ మ్యారేజ్ విషయంలో ఆరవ ప్లేస్‌లో వుందని విద్యార్ధులు ప్రజెంటేషన్‌లో తెలిపిన అంశంపై ఎంపి కేశినేని శివనాథ్ ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో వెనకబడిన రూరల్ గ్రామాల్లో ఋతుస్రావం పరిశుభ్రత పై మహిళలకు అవగాహన కల్పించేందుకు మార్పు ట్రస్ట్‌తో కలిసి పనిచేశామన్నారు.
అతి తక్కువ ధరకే శానిటరీ ప్యాడ్స్ ఇచ్చే విధంగా స్వయం సహాయ సంఘాలకు చెందిన మహిళ ఎంటర్ ప్రెన్యూర్స్‌తో రూరల్ నియోజకవర్గాలైన నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం లో శానిటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ నాలుగు నియోజకవర్గాల్లో వంద గ్రామాల్లో వంద వెండింగ్ మిషన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.