Crime11th Sep 10:11 AMSunil Byrisetty1 min read

‘ఆస్తిపై కన్నేసి సైనైడ్‌ కలిపి ఇచ్చా’

పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో నిందితుడు సాధిక్‌ఖాన్‌ కస్టడీ విచారణలో దిమ్మతిరిగే వాస్తవాలు బయటకొస్తున్నాయి. నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డిని చంపడానికి ప్ర

‘ఆస్తిపై కన్నేసి సైనైడ్‌ కలిపి ఇచ్చా’
పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో నిందితుడు సాధిక్‌ఖాన్‌ కస్టడీ విచారణలో దిమ్మతిరిగే వాస్తవాలు బయటకొస్తున్నాయి. నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డిని చంపడానికి ప్రయత్నించింది తానేనని సాధిక్‌ ఖాన్‌ పోలీసుల ముందు అంగీకరించినట్లు సమాచారం. విచారణలో తనకేమీ తెలియదని నటించిన సాదిక్, సైనైడ్‌ కి సంబంధించిన సాక్ష్యం చూపడంతో బయటపడ్డాడు. ‘జగదీశ్వర్ ని చంపేందుకు విషపదార్థాన్ని మూడు నాలుగు సార్లు ఇచ్చా. తర్వాత హైదరాబాద్‌ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడని సైనైడ్‌ పంపించా. దాని వల్ల చనిపోయాడ’ని చెప్పినట్లు తెలుస్తోంది. ‘జగదీశ్వర్ చనిపోయాక అతడి భార్య సౌజన్యను పెళ్లి చేసుకుని, ఆస్తి రూ.25 కోట్లు లాగుదామనుకున్నా. కానీ ఆమె తండ్రి ఒప్పుకోకపోవడంతో చంపేస్తానని బెదిరించా’ అని సాధిక్‌ పోలీసుల ఎదుట ఒప్పుకొన్నట్లు సమాచారం. దీంతో సాధిక్‌ వల్లే 2 కుటుంబాలు చిన్నాభిన్నం కావడంతోపాటు ఒక కుటుంబం చనిపోవడానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
Andhra Pradesh
Sadik Khan
Nookaraju Family Suicide Case
Panchayat Raj AE
Jagadishwar Reddy
Cyanide Case
Kakinada Crime
సైనైడ్ విషప్రయోగం
సౌజన్య
ఆంధ్రప్రదేశ్ క్రైమ్
క్రైమ్ న్యూస్
పోలీస్ కస్టడీ
ఆస్తి వివాదం
Scroll for the next article