Farmers22nd Jul 12:03 PMSunil Byrisetty1 min read
ప్రకృతి విపత్తుల వేళ అండగా బీమా పథకం
ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కేంద్రం, రాష్ట్రం సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పంటల బీమా పథకం అమలు చేస్తున్నాయి. ఈ పథకంలో ప్రతీ
ప్రస్తుతం నెలకొన్న అనిశ్చిత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కేంద్రం, రాష్ట్రం సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పంటల బీమా పథకం అమలు చేస్తున్నాయి. ఈ పథకంలో ప్రతీ రైతు చేరి పంటల భీమాతో రక్షణ పొంది బీమాతో ధీమాగా వుండే సువర్ణావకాశం వినియోగించుకోవాలి. ఇందుకు సంబంధించి మార్గ దర్శకాలను వివరిస్తూ, గ్రామాలలో అన్నదాతలకు అవగాహన కల్పించడం ఎంతో ముఖ్యమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇందులో వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులతో మమేకం కావాలని అన్నారు. గత ప్రభుత్వం బీమా చెల్లింపులో కానీ పంటలు కోల్పోయినప్పుడు రైతుకు అండగా ఉండే విషయంలో కానీ ఎటువంటి శ్రద్ధా చూపని కారణంగా రైతులు ఎంతో నష్టపోయారని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు రైతులకు అండగా, గ్రామీణ ప్రాంతాల ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా మంత్రి అచ్చెన్న ఉండడంతో ఎప్పటికప్పుడు పథకం అమలు పర్యవేక్షణ అన్నది సుసాధ్యం అవుతుంది.