News24th Dec 02:58 PMSunil Byrisetty1 min read
సుస్థిరాభివృద్ధితో పాటు స్వర్ణాంధ్ర లక్ష్యాలు సాధించాలి
స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు, పదిసూత్రాల అమలుపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఆర్ధిక, వైద్యారోగ్య, రవాణా, పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన, పురపాలక,
స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు, పదిసూత్రాల అమలుపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఆర్ధిక, వైద్యారోగ్య, రవాణా, పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన, పురపాలక, ఐటీ తదితర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సు అనే విధానంలో వేగంగా పౌరులకు మెరుగైన పాలన అందించేలా కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. సుస్థిరాభివృద్ధితో పాటు స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించేందుకు కావాల్సిన నిర్దేశించుకోవాల్సిన అంశాలపై సమావేశంలో చర్చించారు. జీరో పావర్టీ, మానవ వనరుల అభివృద్ధి, ఉద్యోగాల కల్పన, సాంకేతికత మేళవింపు తదితర అంశాల ఆధారంగా లక్ష్యాల నిర్దేశం చేశారు. సీఎస్ కె.విజయానంద్, జలవనరులు, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.