News7th Jul 06:11 PMSunil Byrisetty1 min read

స‌మ‌య‌పాల‌న పాటించ‌కుంటే స‌స్పెన్ష‌న్‌..

రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) స‌మావేశానికి జిల్లా అధికారులు స‌మ‌య‌పాల‌న పాటించ‌కుంటే సస్పెన్ష‌న్ చేసేందుకు వె

స‌మ‌య‌పాల‌న పాటించ‌కుంటే స‌స్పెన్ష‌న్‌..
రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) స‌మావేశానికి జిల్లా అధికారులు స‌మ‌య‌పాల‌న పాటించ‌కుంటే సస్పెన్ష‌న్ చేసేందుకు వెనుకాడ‌బోమ‌ని, ఉద‌యం 9.30 గంట‌ల‌క‌ల్లా గ్రీవెన్స్ హాల్‌కు జిల్ల అధికారులు చేరుకోవాల‌ని, ఆల‌స్య‌మైతే వేటు త‌ప్ప‌ద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ హెచ్చ‌రించారు. జిల్లా క‌లెక్ట‌రేట్‌లో ప్ర‌తి సోమ‌వారం నిర్వ‌హించే ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక గ్రీవెన్స్ హాల్ అయిన పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో జిల్లా అధికారుల‌కు క‌లెక్ట‌ర్ నుంచి ఊహించని సంఘ‌ట‌న ఎదురైంది. కొంద‌రు అధికారులు స‌మావేశానికి ఆల‌స్యంగా రావ‌డాన్ని గ‌మ‌నించిన జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఒకింత అస‌హ‌నానికి గురై ఆల‌స్యంగా చేరుకున్న అధికారుల‌కు తుది హెచ్చ‌రిక‌లు జారీచేశారు. కొంద‌రు జిల్లా అధికారులు బేఖాత‌రు చేయ‌డం విధుల‌ప‌ట్ల అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లు భావించాల్సి వ‌స్తోంద‌న్నారు. ఇక‌పై ఇలాంటి వాటిని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఉపేక్షించ‌బోన‌న్నారు. 9.30 గంట‌ల‌కు గ్రీవెన్స్ హాల్ డోర్లు మూసివేయాల‌ని సంబంధిత సిబ్బందికి క‌లెక్ట‌ర్ హుకుం జారీచేశారు. 10 గంట‌ల‌క‌ల్లా హాజ‌రుప‌ట్టిక‌ను త‌మ ముందు ఉంచాల‌ని.. ముంద‌స్తు అనుమ‌తి లేకుండా ఆల‌స్యంగా వ‌చ్చినా, గైర్హాజ‌రైనా అధికారులను స‌స్పెండ్ చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు.
Andhra Pradesh news
Vijayawada
Public Grievance Redressal Forum
suspend
Collector Lakshmisha
ఆలస్యంగా చేరుకున్న అధికారులకు తుది హెచ్చరికలు
Scroll for the next article