Politics27th Apr 12:58 PMSunil Byrisetty1 min read
నెక్స్ట్ వికెట్ సవాంగ్.. అరెస్ట్ తప్పదా!?
గత ప్రభుత్వంలో చట్టాన్ని పక్కన పెట్టి, ఇష్టానుసారంగా పని చేసిన పోలీసులకు చిక్కులు తప్పట్లేదు. ఇప్పటికే పలువురు ఐపీఎస్ అధికారులు కూటమి సర్కారు విచారణలో కటకటాల్లోకి వెళ్తున్నారు.
గత ప్రభుత్వంలో చట్టాన్ని పక్కన పెట్టి, ఇష్టానుసారంగా పని చేసిన పోలీసులకు చిక్కులు తప్పట్లేదు.
ఇప్పటికే పలువురు ఐపీఎస్ అధికారులు కూటమి సర్కారు విచారణలో కటకటాల్లోకి వెళ్తున్నారు.
మాజీమంత్రి విడదల రజిని ఇష్యూలో ఐపీఎస్ జాషువా, ముంబై నటి జెత్వానీ అంశంలో.. సీనియర్ ఐపీఎస్.. సీతారామాంజ నేయులు కోర్టు మెట్లెక్కారు.
అప్పట్లో దూకుడుగా వ్యవహరించిన ఐపీఎస్‌ల ను కూటమి సర్కారు తనదైన శైలిలో విచారిస్తోంది.
ఇప్పుడు మాజీ డీజీపీ గౌతం సవాంగ్ వంతు వచ్చినట్లు తెలుస్తోంది.
ఆయన డీజీపీగా ఉన్న సమయంలో చంద్రబాబుపై రాళ్లదాడి, టీడీపీ ఆఫీసుపై వైసీపీ నాయకుల దాడుల్లో ఏకపక్షంగా వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
మొత్తంగా.. ఇప్పుడు గౌతం సవాంగ్ వంతు వచ్చిందని...సొంత రాష్ట్రంలో అస్సాంలో ఉంటున్న ఆయన్ని తీసుకొస్తారా అనేది తెలియాల్సి ఉంది.