Crime18th Mar 06:18 PMSunil Byrisetty1 min read

థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? కోర్టు ముందు పోసాని!

సినీ నటుడు పోసాని కృష్ణమురళి కథ కొనసాగుతూనే ఉంది. అరెస్టులు, పీటీ వారెంట్లతో రాష్ట్రమంతా తిరుగుతూనే ఉన్నారు. ఒక జైలు నుంచి మరొక జైలుకు, ఒక కోర్టు నుంచి మరొక కోర్టు ఇలా అంతులేని కథల

థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? కోర్టు ముందు పోసాని!
సినీ నటుడు పోసాని కృష్ణమురళి కథ కొనసాగుతూనే ఉంది. అరెస్టులు, పీటీ వారెంట్లతో రాష్ట్రమంతా తిరుగుతూనే ఉన్నారు. ఒక జైలు నుంచి మరొక జైలుకు, ఒక కోర్టు నుంచి మరొక కోర్టు ఇలా అంతులేని కథలా సాగుతోంది. తాజాగా గుంటూరులో పోసాని సీఐడీ పోలీసుల విచారణ ముగిసింది. 4 గంటలపాటు సీఐడీ పోలీసుల విచారణ సాగింది. విచారణలో అనేక అంశాలపై పోసానిని ప్రశ్నించిన పోలీసులు, సమయం సరిపోవకపోవడంతో మరోసారి పోలీసుల విచారణకు అడిగే అవకాశాలు ఉన్నాయి. సీఐడీ విచారణపై పోసానిని ప్రశ్నించిన గుంటూరు కోర్టు జడ్జి విచారణ సక్రమంగా జరిగిందా అనడిగారు. థర్డ్ డిగ్రీ వాడారా? అని ప్రశ్నించారు. అయితే తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదని, లాయర్ల సమక్షంలో విచారణ జరిగిందని పోసాని సమాధానమిచ్చారు. గుంటూరు కోర్టులో పోసాని విచారణ ముగియడంతో, గుంటూరు సబ్ జైలుకు తరలించారు.
Andhra Pradesh
AP CID Guntur
Court posani krishna murali
ఆంధ్రప్రదేశ్
గుంటూరు
కోర్టు పోసాని కృష్ణ మురళి
Scroll for the next article