Celebrities17th Mar 02:57 PMSunil Byrisetty1 min read

నానిని ఆడు మగాడ్రా అన్న సుధాకర్

ఇటీవల విడుదలైన కోర్టు చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ చిత్రంలో నటించిన శుభలేఖ సుధాకర్ సినిమా గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. చిత్ర కథ ఎంపిక నుంచి దర్శకత్వం, నటీనటుల

నానిని ఆడు మగాడ్రా అన్న సుధాకర్
ఇటీవల విడుదలైన కోర్టు చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ చిత్రంలో నటించిన శుభలేఖ సుధాకర్ సినిమా గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. చిత్ర కథ ఎంపిక నుంచి దర్శకత్వం, నటీనటుల ఎంపిక, వారి నటన గొప్పగా ఉండటం చక్కటి విజయాన్ని అందించిందన్నారు. నటుడు నానితో శ్యామ్ సింగరాయ్ చిత్రం నుంచి మంచి పరిచయం ఉందన్నారు. కోర్టు సినిమాలో కూడా చక్కటి పాత్ర ఇచ్చినందుకు ఎంతో సంతోషమన్నారు. నటుడు శివాజితో కలిసి నటించిన ఎన్నో సన్నివేశాలు మంచి పేరు తెచ్చాయన్నారు. నాని, శివాజి, దర్శకులకు హ్యాట్సాఫ్ చెప్పారు. సినిమాలో ఉన్న వైబ్రేషన్స్ ఇప్పుడు ప్రేక్షకుల్లో కనిపించడం చిత్రవిజయాన్ని ఎత్తి చూపుతోందన్నారు. నానిని చూస్తే ‘మగాడ్రా వీడు’ అనిపిస్తోందని ప్రశంసించారు. సక్సెస్, నటన గురించి ఎవరైనా మాట్లాడితే ఎనర్జీ వస్తుందని, ఆ ఎనర్జీ నానిలో ఎంతో ఉందని సుధాకర్ అన్నారు
Subhalekha Sudhakar
Court
Movie
Priyadarshi
Nani
కోర్టు
సినిమా
ప్రియదర్శి
నాని
Scroll for the next article