Politics4th Jul 04:30 PMSunil Byrisetty1 min read

తమిళనాడు సీఎం అభ్యర్థిగా దళపతి విజయ్!

'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) అధ్యక్షుడు దళపతి విజయ్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది. రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వ్యవస్థా

తమిళనాడు సీఎం అభ్యర్థిగా దళపతి విజయ్!
'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) అధ్యక్షుడు దళపతి విజయ్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించింది. రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన విజయ్‌ను ఎన్నుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పార్టీ కార్యనిర్వాహక మండలి సమావేశమై ఏకగ్రీవంగా తీర్మానించినట్లు వెల్లడించింది. ఇటీవలే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్, టీవీకే పార్టీని స్థాపించి తొలి సమావేశం ద్వారా తన సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల ముందుంచారు. 2026 ఎన్నికల్లో తమ పార్టీదే గెలుపని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని గతంలోనే స్పష్టం చేశారు.
Tamilnadu
tamilnadu polls
Elections
Vijay to be TVK's chief ministerial
no alliance with BJP
2026 Polls
తమిళనాడు సీఎం అభ్యర్థిగా దళపతి విజయ్
Scroll for the next article