Entertainment5th Jan 05:41 PMSunil Byrisetty1 min read
క్షమాపణలు చెప్పిన అనసూయ.. ఎందుకంటే!
తరచుగా వార్తల్లో ఉండే నటి అనసూయ ఎట్టకేలకు తగ్గి క్షమాపణలు చెప్పింది. ఇటీవల డ్రస్సింగ్‌పై వరుస పోస్టులతో నా ఇష్టమంటూ విరుచుకుపడింది. అయితే అనసూయ గతంలో ఓ టీవీ షోలో నటి రాశిపై చేసిన డ
తరచుగా వార్తల్లో ఉండే నటి అనసూయ ఎట్టకేలకు తగ్గి క్షమాపణలు చెప్పింది. ఇటీవల డ్రస్సింగ్‌పై వరుస పోస్టులతో నా ఇష్టమంటూ విరుచుకుపడింది. అయితే అనసూయ గతంలో ఓ టీవీ షోలో నటి రాశిపై చేసిన డబుల్ మీనింగ్ వ్యాఖ్యలపై ఆమె ఇటీవల ఒక పోస్ట్ పెట్టారు. రాశి స్పందనపై యాంకర్ అనసూయ భరద్వాజ్ తాజాగా క్షమాపణలు చెప్పింది. ఆ స్కిట్లో వచ్చిన డైలాగులను అప్పట్లో ప్రశ్నించలేకపోయానని అంగీకరించింది. అది తన తప్పేనని, కాలక్రమేణా తాను మారానని వివరణ ఇచ్చింది. మహిళల గౌరవం, భద్రత కోసం నిలబడటం నేర్చుకున్నానని సోషల్ మీడియాలో పేర్కొంది. అనసూయ క్షమాపణలు చెప్పడం ద్వారా హుందాగా వ్యవహరించినట్లు నెటిజన్లు పేర్కొంటున్నారు.