Entertainment11th Dec 04:13 PMSunil Byrisetty1 min read

పతకాలు కొట్టిన ప్రగతి.. నాగబాబు కితాబు

నటి ప్రగతి అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ లో సాధించడంపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ప్రశంసించారు. ఏషియన్ ఓపెన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌-2025లో ప్రగతి ఏకంగా నాలుగు పతకాలు గెలుచుకోవడం

పతకాలు కొట్టిన ప్రగతి.. నాగబాబు కితాబు
నటి ప్రగతి అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ లో సాధించడంపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ప్రశంసించారు. ఏషియన్ ఓపెన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌-2025లో ప్రగతి ఏకంగా నాలుగు పతకాలు గెలుచుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. నటనతో పాటు క్రీడల్లోనూ అంతర్జాతీయ స్థాయిలో రాణించడం ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. "గతంలో ఒకసారి ప్రగతి చీర కట్టుకుని పవర్ లిఫ్టింగ్ చేయడం గమనించాను. అది చూసి 'ఇదేంటి చీరకట్టుకుని పవర్ లిఫ్టింగ్ చేస్తోంది, బహుశా సరదా కోసమేమో' అని అనుకున్నాను. కానీ, ఇంత నిబద్ధతతో సాధన చేసి అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తుందని నేను ఊహించలేదు" అని నాగబాబు పేర్కొన్నారు. ఆమె పట్టుదల, కృషిని అభినందించారు.
Andhra Pradesh
Inspirational achievement
Pragathi
Weightlifting
Asian Open Powerlifting Championship 2025
Nagababu
Janasena
International sports
Women in sports
Medal winner
Scroll for the next article