News20th Apr 10:34 AMSunil Byrisetty1 min read

పోలీస్ స్టేషన్‌లో శ్రీరెడ్డి

వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులను దూషించడంపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆ కేసులో శ్రీరెడ్డిని విజయనగరం జిల

పోలీస్ స్టేషన్‌లో శ్రీరెడ్డి
వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులను దూషించడంపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆ కేసులో శ్రీరెడ్డిని విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆమెపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నారు. కాగా ఇప్పటికే శ్రీరెడ్డి కూటమి నాయకులకు క్షమాపణలు చెప్పినా కూటమి నేతలు, కార్యకర్తలు మాత్రం తగ్గడం లేదు. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Vizianagaram
Sri Reddy
Pusapatirega Police Station
మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు
శ్రీరెడ్డి కూటమి నాయకులకు క్షమాపణలు
Scroll for the next article