News24th Aug 05:14 PMSunil Byrisetty1 min read
అదానీకి కడపలో 1200 ఎకరాలు
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములు కేటాయిస్తోంది. తాజాగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కడప జిల్లాలో 250 మెగావాట్ల సామర్థ్యంతో అదానీ సంస్
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున భూములు కేటాయిస్తోంది. తాజాగా
కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
తీసుకుంది. కడప జిల్లాలో 250 మెగావాట్ల సామర్థ్యంతో అదానీ సంస్థ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం దోడియం, వడ్డిరాల గ్రామాల్లో 1200 ఎకరాల భూమిని అదానీ సంస్థకు 33 ఏళ్లకు లీజు ప్రాతిపదికన కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్లకు ఒకసారి 10% లీజు ధర పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సంస్థ రాకతో భారీగా ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు.