News8th Nov 05:08 PMSunil Byrisetty1 min read

త్వరలో బీసీలకు ఆదరణ – 3 పథకం

వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి బీసీలంతా అండగా నిలవాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చిరు. కళ్యాణదుర్గంలో భక్త కనకదాసు

త్వరలో బీసీలకు ఆదరణ – 3 పథకం
వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి బీసీలంతా అండగా నిలవాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చిరు. కళ్యాణదుర్గంలో భక్త కనకదాసు జయంతి సభలో మంత్రి సవిత మాట్లాడుతూ.. అన్న ఎన్టీఆర్ స్పూర్తితో బీసీల పక్షపాతిగా పనిచేస్తున్న మంత్రి లోకేష్ కు అభినందనలు తెలిపారు. కురుబ కులం నీతి, నిజాయతీకి మారుపేరు అన్నారు. లోకేష్ పాదయాత్రలో బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారని చెప్పారు. రాయలసీమలో అధికంగా ఉన్న కురుబ కులస్తులను గుర్తించి కనకదాసు జయంతిని అధికారికంగా నిర్వహించడం, విగ్రహావిష్కరణ చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. బీసీలు తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ వంటి వారని, గుడికట్ల పూజారులకు గౌరవవేతనం ఇవ్వడం హర్షణీయమని పేర్కొన్నారు. గొర్రెల ఇన్సూరెన్స్ పై చంద్రబాబు, లోకేష్ చర్చిస్తున్నారు. త్వరలో ఇన్సూరెన్స్ ప్రకటించబోతున్నారన్నారు. ఆదరణ-1, ఆదరణ-2 తెచ్చింది చంద్రబాబు అని, ఆదరణ – 3 తెచ్చేది కూడా చంద్రబాబు అని పేర్కొన్నారు.
Andhra Pradesh
BC Welfare
Adarana 3
Chandrababu Naidu
Nara Lokesh
Minister Savita
Backward Classes
Kuruba Community
రాయలసీమ
సంక్షేమ పథకాలు
గొర్రెల ఇన్సూరెన్స్
సమాజ అభివృద్ధి
ఎన్టీఆర్ స్పూర్తి
Scroll for the next article