News31st Dec 03:34 PMSunil Byrisetty1 min read

సంక్రాంతి రద్దీ దృష్ట్యా అదనపు రైళ్లు

అదనపు రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు అదనంగా మరో 11 రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. జ

సంక్రాంతి రద్దీ దృష్ట్యా అదనపు రైళ్లు
అదనపు రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు అదనంగా మరో 11 రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. జనవరి 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు కాకినాడ, వికారాబాద్‌, పార్వతీపురం, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ల మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. కాకినాడ టౌన్-వికారాబాద్‌ (07186, 07460), వికారాబాద్‌-కాకినాడ టౌన్ (07185, 07187) మార్గాల్లో రైళ్లు నడవనున్నాయి. అలాగే వికారాబాద్‌-పార్వతీపురం (07461), పార్వతీపురం-వికారాబాద్‌ (07462), పార్వతీపురం-కాకినాడ టౌన్‌ (07463), సికింద్రాబాద్‌-పార్వతీపురం (07464, 07465) మధ్య సర్వీసులు అందుబాటులో ఉంటాయి. విజయవాడ మీదుగా కూడా పలు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. విశాఖపట్నం-చర్లపల్లి (08511) స్పెషల్ రైలు జనవరి 10, 12, 17, 19 తేదీల్లో సాయంత్రం 5.30 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.15కు చర్లపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 11, 13, 18, 20 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఇక అనకాపల్లి-వికారాబాద్‌ ప్రత్యేక రైలు (07416) జనవరి 18న రాత్రి 9.45కు బయలుదేరనుంది.
Sankranti Special Trains
South Central Railway
Festival Rush
Special Train Services
Kakinada Town
Vikarabad
Parvathipuram
Secunderabad
Vijayawada Route
Scroll for the next article