Education26th Oct 12:09 PMSunil Byrisetty1 min read
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ప్రవేశాలు
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2025–26 విద్యాసంవత్సరానికి పలు కోర్సులలో ప్రవేశాలు ప్రారంభించింది. అందుబాటులో M.A. తెలుగు, M.A. చరిత్ర, M.A. విజువల్ ఆర్ట్స్ (రెగ్యులర్ & ఇం
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2025–26 విద్యాసంవత్సరానికి పలు కోర్సులలో ప్రవేశాలు ప్రారంభించింది. అందుబాటులో M.A. తెలుగు, M.A. చరిత్ర,
M.A. విజువల్ ఆర్ట్స్ (రెగ్యులర్ & ఇండస్ట్రియల్), చరిత్ర-సంస్కృతి- పురావస్తుశాస్త్రం, M.P.A. కూచిపూడి నృత్యం, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు – సంగీతం, నృత్యం, సాహిత్యం తదితర కోర్సులు నిర్వహిస్తోంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 15 చివరి తేదీగా పేర్కొంది. రూ. 200 దరఖాస్తు రుసుంగా, లేట్ ఫీతో నవంబర్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ డా. ఎం. శ్రీనివాసరావు ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తులను ‘కన్వీనర్, సెంట్రల్ అడ్మిషన్స్ కమిటీ,
పోట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరం’ అనే చిరునామాకు పంపాలని సూచించారు.