Notifications31st Jul 05:08 PMSunil Byrisetty1 min read
తిరుపతి ఎస్ఐహెచ్ఎంలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో అడ్మిషన్లు
తిరుపతిలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో (ఎస్ఐహెచ్ఎం) 2026-27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని సంస్థ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. రమణ ప్రసా
తిరుపతిలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో (ఎస్ఐహెచ్ఎం) 2026-27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని సంస్థ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. రమణ ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖల భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ సంస్థలో ఇంటర్ ఉత్తీర్ణులైన వారికి 3 ఏళ్ల B.Sc (హాస్పిటాలిటీ & హోటల్ అడ్మినిస్ట్రేషన్), 10వ తరగతి పూర్తి చేసిన వారికి 1.5 ఏళ్ల క్రాఫ్ట్స్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అందుబాటులో ఉన్నాయన్నారు. కోర్సులో భాగంగా 17 వారాల పాటు ప్రత్యక్ష పరిశ్రమ శిక్షణ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్) ఇస్తారని అన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు ప్రముఖ హోటల్ గ్రూప్‌లలోను, దేశ విదేశాల్లోనూ మంచి ఉద్యోగాలు సాధించారని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు www.sihmtpt.org వెబ్‌సైట్ ద్వారా లేదా నేరుగా కళాశాలలో దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. వివరాలకు 97013 73846, 97004 40604 ఫోన్ నంబర్లలో గానీ, sihmtpt@gmail.com ఇ-మెయిల్‌లో సంప్రదించవచ్చని ప్రిన్సిపల్ డా. ఆర్. రమణ ప్రసాద్ తెలిపారు.