Politics20th Jun 01:07 PMSunil Byrisetty1 min read

దళిత సోదరులకు క్షమాపణలు: ఆదోని ఎమ్మెల్యే పార్ధసారథి

కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన సమావేశంలో చోటు చేసుకున్న సంఘటన దురదృష్టకరమని బీజేపీ ఎమ్మెల్యే పార్ధసారథి పేర్కొన్నారు. ఆ వీడియోలో సంభాషణపై గందరగోళం నెలకొన్న సందర్భంలో తాను సమాధా

దళిత సోదరులకు క్షమాపణలు: ఆదోని ఎమ్మెల్యే పార్ధసారథి
కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన సమావేశంలో చోటు చేసుకున్న సంఘటన దురదృష్టకరమని బీజేపీ ఎమ్మెల్యే పార్ధసారథి పేర్కొన్నారు. ఆ వీడియోలో సంభాషణపై గందరగోళం నెలకొన్న సందర్భంలో తాను సమాధానం చెబుతున్నానన్నారు. దళిత సంఘాలు, నాయకులతో చర్చించానన్నారు. ఆ వీడియో ప్రచారానికి తెర దించేందుకు అందరితో చర్చించానని, అందుకే దళిత సోదరులందరికీ బహిరంగ క్షమాపణలు చెబుతున్నానన్నారు. బీసీలు, దళితుల కోసం ఉద్యమించడానికి తానెప్పుడూ సిద్ధమేనని, డా. బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. దళిత సోదరులతో తమకున్న అనుబంధంలో చిచ్చు పెట్టాలని, దళితులను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకునేవారి ఆటలు సాగవని పేర్కొన్నారు.
Andhra Pradesh news
kurnool
Ap Politics
Bc
MLA Adhoni
partha sarathy
దళిత సోదరులకు క్షమాపణలు
Scroll for the next article