News19th Sep 11:16 AMSunil Byrisetty1 min read
ఆత్రేయపురం పూతరేకుల్లో కల్తీ నెయ్యి
అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఆత్రేయపురం పూతరేకుల్లో కల్తీ నెయ్యి ఉందనే సమాచారం కలకలం రేపింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలోని పూతరేకుల తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు
అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఆత్రేయపురం పూతరేకుల్లో కల్తీ నెయ్యి ఉందనే సమాచారం కలకలం రేపింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలోని పూతరేకుల తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. పూతరేకుల్లో కల్తీ నెయ్యి వాడుతున్నారనే ఫిర్యాదులతో తనిఖీలు నిర్వహించి, 21 నెయ్యి నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపారు. ప్రాథమికంగా కల్తీ జరిగినట్లు గుర్తించామని, ల్యాబ్ నివేదిక వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. జీఐ ట్యాగ్ కూడా వచ్చిన ఆత్రేయపురం పూతరేకుల్లో కల్తీ జరగడంపై కలకలం రేగుతోంది.