News19th Jul 10:39 AMSunil Byrisetty1 min read

ఎయిమ్స్‌లో అత్యాధునిక యూనిట్స్

మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లో అత్యాధునిక ఎన్ఐసీయూ, పీఐసీయూ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం జరిగింది. ఐపీడీ బ్లాక్‌లోని 3వ అంతస్తులో కొత్తగా స్థాపించిన పీడియాట్ర

ఎయిమ్స్‌లో  అత్యాధునిక యూనిట్స్
మంగళగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లో అత్యాధునిక ఎన్ఐసీయూ, పీఐసీయూ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం జరిగింది. ఐపీడీ బ్లాక్‌లోని 3వ అంతస్తులో కొత్తగా స్థాపించిన పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (PICU), నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) కాంప్లెక్స్ ని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ ప్రొఫెసర్ డా అహంతెం శాంతా సింగ్ ప్రారంభించారు. డీన్ అకాడెమిక్స్, మెడికల్ సూపరింటెండెంట్, జాయింట్ మెడికల్ సూపరింటెండెంట్, ఫ్యాకల్టీ సభ్యులు, నర్సింగ్ సిబ్బంది సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ పీడియాట్రిక్స్ బృందానికి ప్రొఫెసర్ అహంతెం శుభాకాంక్షలు తెలిపారు. ఈ అత్యాధునిక PICU-NICU కాంప్లెక్స్, అధునాతన లైఫ్-సపోర్ట్ సిస్టమ్‌లు, ఆధునిక పర్యవేక్షణ సాంకేతికతలతో అమర్చారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువులు, పిల్లలకు సమగ్రమైన, 24 గంటల ఇంటెన్సివ్ కేర్‌ను అందిస్తుంది.
Andhra Pradesh news
AIIMS Mangalagiri
NICU PICU Inauguration
Intensive Care Unit for Children
Ahanthem Santa Singh
ఎయిమ్స్‌లో అత్యాధునిక యూనిట్స్
Scroll for the next article