Health29th Apr 05:02 PMSunil Byrisetty1 min read

వేసవి వేడికి మందు.. తాటి ముంజెలు!

వేసవిలో వేడిని ఇట్టే తగ్గించేసే నేచురల్ ఫ్రూట్ తాటి ముంజె. సీజనల్ ఫ్రూట్ అయిన ముంజెలు ఎక్కడ దొరికినా తీసుకోండి. ఇది శరీరంలో టాక్సిన్స్ వదిలించుకోవడానికి సహాయపడుతుంది, ఇది శరీర సహజ

వేసవి వేడికి మందు.. తాటి ముంజెలు!
వేసవిలో వేడిని ఇట్టే తగ్గించేసే నేచురల్ ఫ్రూట్ తాటి ముంజె. సీజనల్ ఫ్రూట్ అయిన ముంజెలు ఎక్కడ దొరికినా తీసుకోండి. ఇది శరీరంలో టాక్సిన్స్ వదిలించుకోవడానికి సహాయపడుతుంది, ఇది శరీర సహజ ఉష్ణోగ్రతను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. ఐస్ యాపిల్‌గా పిలిచే ముంజె అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. 100 గ్రాముల ముంజెల్లో 43 కేలరీలు ఉంటాయి. మూడు తాటి ముంజెలు తిన్నట్లయితే, ఒక కొబ్బరిబొండాన్ని తాగినంత ఫలితం ఉంటుంది. లేత తాటిముంజెల్లో దాదాపు ఎనభై శాతానికి పైగా నీరే ఉంటుంది. విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి తాటిముంజెలు చక్కని ఫలహారమని చెప్పొచ్చు.
Taati Munjalu
Summer Special
Seasonal fruit
నేచురల్ ఫ్రూట్ తాటి ముంజె
శరీరంలో టాక్సిన్స్
100 గ్రాముల ముంజెల్లో 43 కేలరీలు
ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి
Scroll for the next article