News27th Jun 05:21 PMSunil Byrisetty1 min read
విజయవాడలో బోర్డు తిప్పేసిన సంస్థ
విజయవాడలో ఓ వ్యాపార సంస్థ తమక కస్టమర్లకు భారీగా కుచ్చుటోపి పెట్టింది. గుణదల ఎన్టీఆర్ కాలనీలో ఉంటున్న అద్విక ట్రేడింగ్ కంపెనీ ప్రజలకు అధిక వడ్డీలు ఇస్తామంటూ సుమారు 300 మంది నుంచి భా
విజయవాడలో ఓ వ్యాపార సంస్థ తమక కస్టమర్లకు భారీగా కుచ్చుటోపి పెట్టింది. గుణదల ఎన్టీఆర్ కాలనీలో ఉంటున్న అద్విక ట్రేడింగ్ కంపెనీ ప్రజలకు అధిక వడ్డీలు ఇస్తామంటూ సుమారు 300 మంది నుంచి భారీగా రూ. కోట్ల నగదును వసూలు చేసింది. అయితే ఇస్తామన్న చెల్లింపులు చేయకపోవడంతో కొంతమంది కస్టమర్లకు అనుమానం వచ్చింది. దీంతో కైకలూరుకు చెందిన ఓ వ్యక్తి టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు విచారణ చేపట్టగా సంస్థ ఎండి వెంకట ఆదిత్యను మాచవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.