News28th Nov 05:09 PMSunil Byrisetty1 min read
అన్న క్యాంటీన్లకు అడ్వైజరీ కమిటీలు
రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్యాంటీన్ల నిర్వహణ, నాణ్యత, పారదర్శకతను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం అన్న క్యాంటీన్ లెవల్ అడ్వైజరీ కమిటీ
రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్యాంటీన్ల నిర్వహణ, నాణ్యత, పారదర్శకతను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం అన్న క్యాంటీన్ లెవల్ అడ్వైజరీ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీలలో ఛైర్మన్ గా మున్సిపల్ చైర్‌పర్సన్ లేదా కార్పొరేటర్ ఉంటారు. శానిటేషన్ & ఎన్విరాన్‌మెంట్ వార్డు సెక్రటరీ, వార్డు ఉమెన్ వీకర్స్ సెక్షన్ సెక్రటరీ, స్థానిక NGO ప్రతినిధి, SHG/TLF ప్రతినిధి, సంబంధిత అన్న క్యాంటీన్ నోడల్ ఆఫీసర్ – కన్వీనర్లుగా ఉంటారు. ఈ కమిటీలు ఆహార నాణ్యత, పరిశుభ్రతపై కఠిన పర్యవేక్షణ, ప్రతి భోజనానికి “డైలీ ఫుడ్ టేస్ట్ టెస్ట్” నమోదు చేయడం, క్యాంటీన్ ఆపరేషన్లపై రోజువారీ–వారపు రికార్డులు, సీసీటీవీ, FRS, వంటి టెక్నాలజీ పరికరాల పరిశీలన, లబ్ధిదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరణ, సేవల్లో లోపాలు ఉంటే వెంటనే పరిష్కారం, కమ్యూనిటీ భాగస్వామ్యం, వాలంటీర్ల సమన్వయం, ప్రభుత్వ ఆమోదిత వారపు మెను అమలు పరిశీలన చేయాల్సి ఉంటుంది.