News17th Aug 11:54 AMSunil Byrisetty1 min read
భోగాపురం విమానాశ్రయానికి 'ఏరో ఎక్స్‌ప్రెస్' ఏసీ బస్సులు
విశాఖపట్నం నుంచి ప్రతి అరగంటకు భోగాపురం విమానాశ్రయానికి బస్సులు నడుపుతున్నారు. విశాఖపట్నం విమానాశ్రయానికి విమాన సర్వీసులు నిలిపివేసిన నేపథ్యంలో భోగాపురం నుంచి ఎయిర్ ఆపరేషన్స్ మొదలయ
విశాఖపట్నం నుంచి ప్రతి అరగంటకు భోగాపురం విమానాశ్రయానికి బస్సులు నడుపుతున్నారు. విశాఖపట్నం విమానాశ్రయానికి విమాన సర్వీసులు నిలిపివేసిన నేపథ్యంలో భోగాపురం నుంచి ఎయిర్ ఆపరేషన్స్ మొదలయ్యాయి. అందుకోసం విమాన ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా భోగాపురం విమానాశ్రయానికి బస్సులు నడుపుతున్నారు. ప్రతి 30 నిమిషాలకు ఒక 'ఏరో ఎక్స్‌ప్రెస్' ఏసీ బస్సు నడిపేలా APSRTC ప్రణాళిక రూపొందించింది. పాత గాజువాక నుంచి ఉదయం 4.55 గంటలకు తొలి సర్వీసు ప్రారంభమవుతోంది. ఈ బస్సుల్లో సాధారణ ప్రయాణికులను కూడా అనుమతిస్తున్నారు. అలాగే విశాఖ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి విమానాశ్రయానికి బస్సు సర్వీసులు నడుస్తున్నాయి.