News2nd Dec 04:17 PMSunil Byrisetty1 min read

13 ఏళ్ల నిరీక్షణకు తెర.. 246 మంది రైతులకు 186 ఎకరాల భూమి

గత 13 ఏళ్లుగా రికార్డుల్లో చిక్కుకుపోయిన భూ సమస్యను పరిష్కరించి, మాకవరపాలెం మండలానికి చెందిన 246 మంది రైతులకు 186.14 ఎకరాల భూమిని తిరిగి అప్పగించినట్లు ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల

13 ఏళ్ల నిరీక్షణకు తెర.. 246 మంది రైతులకు 186 ఎకరాల భూమి
గత 13 ఏళ్లుగా రికార్డుల్లో చిక్కుకుపోయిన భూ సమస్యను పరిష్కరించి, మాకవరపాలెం మండలానికి చెందిన 246 మంది రైతులకు 186.14 ఎకరాల భూమిని తిరిగి అప్పగించినట్లు ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. 2012లో ఏపీఐఐసీ (APIIC) కోసం సేకరించిన భూముల్లో రికార్డుల పరమైన లోపాలు తలెత్తాయని, దీంతో రైతులు తమ భూమి ఎక్కడుందో తెలియక, రుణాలు అందక, ప్రభుత్వ పథకాలకు దూరమై తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి, అధికారులతో సమగ్ర విచారణ జరిపించినట్లు తెలిపారు. అనకాపల్లి జాయింట్ కలెక్టర్ పాత రికార్డులన్నింటినీ పరిశీలించి, ఆ భూములను తిరిగి రైతులకు అప్పగిస్తూ (ఆర్.సి. నెం. 1219/2025/డి3) ఉత్తర్వులు జారీ చేశారని పేర్కొన్నారు. తక్షణమే ఆర్డీవో, ఎంఆర్వోలు క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు, రైతు భరోసా వంటి పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆన్‌రాక్ అల్యూమినియం కంపెనీ ప్రతినిధులతో జరిగిన చర్చల వివరాలను స్పీకర్ గారు వెల్లడించారు. కంపెనీ నిర్వహణలో భూములు కోల్పోయిన రైతులకు, స్థానికులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని షరతు విధించినట్లు చెప్పారు. నిర్వాసిత కాలనీలో రోడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతులను వెంటనే పూర్తి చేయాలి. ఉద్యోగాల విషయంలో సిఫార్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోనని, అర్హులైన నిర్వాసితులకే న్యాయం జరగాలని ఆయన స్పష్టం చేశారు.
Andhra Pradesh
Farmer Relief
Land Allotment
APIIC
Chintakayala Ayynapathrudu
Mackavarpalem
Agriculture
Government Schemes
Farmer Welfare
రైతు మద్దతు
సీఎం చంద్రబాబు నాయుడు
మౌలిక వసతుల అభివృద్ధి
స్థానికులకు ఉద్యోగాలు
Scroll for the next article