Entertainment21st Oct 05:57 PMSunil Byrisetty1 min read

కంపెనీ తర్వాత.. పోలీస్ కంపెనీ

సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ముంబై అండర్‌వరల్డ్‌, ఎన్‌కౌంటర్లు, నేర ప్రపంచం చుట్టూ అల్లుకున్న కథాంశం

కంపెనీ తర్వాత.. పోలీస్ కంపెనీ
సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ముంబై అండర్‌వరల్డ్‌, ఎన్‌కౌంటర్లు, నేర ప్రపంచం చుట్టూ అల్లుకున్న కథాంశంతో ‘పోలీస్‌ కంపెనీ’ అనే క్రైమ్‌ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు. ముంబై ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ దయా నాయక్‌ పాత్రలో హర్షవర్ధన్‌ రాణే నటిస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. తాజాగా సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేసిన ఆర్జీవీ.. విడుదల తేదీని కూడా ప్రకటించారు. ఈ చిత్రం 2027 జూన్‌ 4న థియేటర్లలోకి రానుంది. ‘పోలీస్‌ కంపెనీ’ అనే టైటిల్‌ వెనుక ఉన్న ఆలోచనేంటో రామ్‌ గోపాల్‌ వర్మ వెల్లడించారు. పోలీసు వ్యవస్థ ప్రజల కోసం పనిచేసే సంస్థ అని, కంపెనీ అంటే డబ్బు సంపాదించే వ్యవస్థ అని పేర్కొన్నారు. అయితే అధికారం హద్దులు దాటినప్పుడు ఒక సంస్థ కూడా కంపెనీలా పనిచేయడం ప్రారంభిస్తుందని, ఈ ఆలోచన నుంచే ‘పోలీస్‌ కంపెనీ’ పేరు పెట్టినట్లు వెల్లడించారు. గతంలోనే ఆర్జీవీ కంపెనీ అనే సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే.
Scroll for the next article