News20th Nov 11:04 AMSunil Byrisetty1 min read
ఐబొమ్మ పోయే.. ఐ బొమ్మ వన్ వచ్చే!
ఇటీవల ఐ బొమ్మ రూపకర్త ఇమ్మడి రవిని అరెస్ట్ చేసి ప్రపంచంలో పైరసీ లేకుండా చేసినట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆన్లైన్లో 'ఐబొమ్మ వన్' అనే కొత్త పైరసీ సైట్ పుట్టుకొచ్చింది. ఈ సైట్లోనూ
ఇటీవల ఐ బొమ్మ రూపకర్త ఇమ్మడి రవిని అరెస్ట్ చేసి ప్రపంచంలో పైరసీ లేకుండా చేసినట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆన్లైన్లో 'ఐబొమ్మ వన్' అనే కొత్త పైరసీ సైట్ పుట్టుకొచ్చింది. ఈ సైట్లోనూ అనేక కొత్త సినిమాలు కనిపిస్తున్నాయి. ఏదైనా సినిమాపై క్లిక్ చేస్తే 'మూవీ రూల్జ్'కు రీడైరెక్ట్ అవుతోంది. ఐబొమ్మ ఎకో సిస్టంలో 65 మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయని, అందులో ఐబొమ్మ వన్ను ప్రచారంలోకి తెచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ రూల్జ్, తమిళ్ MV సైట్లపైనా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.