News15th Jul 05:54 PMSunil Byrisetty1 min read
జొన్నగిరి తర్వాత.. రామగిరి గోల్డ్ మైన్
రామగిరి గోల్డ్ మైన్‌ను త్వరలోనే వేలం వేసి ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అనంతపురం జిల్లా రామగిరి మండలం
రామగిరి గోల్డ్ మైన్‌ను త్వరలోనే వేలం వేసి ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అనంతపురం జిల్లా రామగిరి మండలంలోని గోల్డ్ మైన్ ప్రాంతాన్ని ఎమ్మెల్యే పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎంఎస్ రాజు, ఆర్టీసీ చైర్మన్ పూల నాగరాజుతో కలిసి పరిశీలించారు. రాష్ట్రంలోని విలువైన వనరుల్ని సద్వినియోగం చేసుకుంటే దేశానికే ఆదర్శంగా మైనింగ్ రంగాన్ని తీర్చిదిద్దగలమన్నారు. రామగిరి గోల్డ్ మైన్‌లో బ్రిటిష్ కాలం నుంచే బంగారం తవ్వకాలు జరిగాయన్నారు. భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ లీజు గడువు ముగిసిన తర్వాత పూర్తిగా కార్యకలాపాలు నిలిచిపోయాయని చెప్పారు. సుమారు 168 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ గనిలో గతంలో భారీగా ముడిసరుకు ఉన్నప్పటికీ ప్రస్తుతం అది కనిపించకపోవడంపై అనేక అనుమానాలున్నాయన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఖనిజ అన్వేషణ కార్యక్రమాలు వేగవంతం చేశామని తెలిపారు.